Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ సెటైర్లు వేశారు. పవన్ కు ఎంత మంది స్ఫూర్తి? అని ఆయన ప్రశ్నించారు. చేగువేరా తనకు స్ఫూర్తి అని గతంలో పవన్ చెప్పారని... ఇప్పుడేమో చంద్రబాబు తనకు స్ఫూర్తి అంటున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు సనాతనధర్మం పేరుతో డ్రామాలాడారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపై కూడా చెల్లుబోయిన విమర్శలు గుప్పించారు. సొంతవారికి సంపద సృష్టించేందుకే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారని మండిపడ్డారు. మద్యం టెండర్లకు దరఖాస్తు ప్రక్రియను రెండు రోజులు పొడిగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రజలను తాగుబోతులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
Studio18 News