Tuesday, 31 March 2026 04:31:43 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Chandrababu Naidu: ఇది ఎక్సలెంట్ న్యూస్: సీఎం చంద్రబాబు

Date : 30 January 2026 07:29 PM Views : 88

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : 'ఐగాట్ కర్మయోగి' ప్లాట్‌ఫామ్‌లో ఏపీ సరికొత్త రికార్డు కోటికి పైగా ఎన్‌రోల్‌మెంట్లు పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఘనత ప్రభుత్వ ఉద్యోగుల నిబద్ధతను కొనియాడిన సీఎం చంద్రబాబు నైపుణ్యం గల పరిపాలన కోసమే ఈ కార్యక్రమమని వెల్లడి ఈ ఘనతలో ఏపీఎస్‌డీపీఎస్‌ పాత్రను అభినందించిన సీఎం ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే 'ఐగాట్ కర్మయోగి' పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది అద్భుతమైన వార్త అని, ప్రభుత్వ ఉద్యోగులు నిరంతర అభ్యాసంపై చూపుతున్న నిబద్ధతకు ఈ ఘనత నిదర్శనమని ఆయన అన్నారు. నైపుణ్యం, చురుకుదనం, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పరిపాలనను నిర్మించడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఐగాట్ కర్మయోగి ప్లాట్‌ఫామ్‌పై కోటికి పైగా కోర్సు ఎన్‌రోల్‌మెంట్లు, 80 లక్షలకు పైగా కోర్సుల పూర్తితో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ఉద్యోగులు మొత్తం 4,290 కోర్సులలో ఈ శిక్షణ పూర్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థను (APSDPS) సీఎం ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఆంధ్రప్రదేశ్ సాధించిన ఈ ఘనతను ప్రశంసించింది. ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పౌర సేవలపై సానుకూల ప్రభావం చూపడంలో రాష్ట్రం ముందుందని కొనియాడింది. ఏపీ సాధించిన ఈ విజయం దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొంది. ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యాన్ని పెంపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతకు ఇది నిలువుటద్దమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :