Studio18 News - ANDHRA PRADESH / : రాష్ట్రానికి పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్‌గా లోకేశ్ ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నారు. అమెరికా పర్యటనకు ముందు ముంబైలో రిలయన్స్ సంస్థతో జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి. ఆయన కృషితో రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిద్ధమైంది. గుజరాత్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీలో మాత్రమే ఇంత పెద్దఎత్తున పెట్టుబడులకు సిద్ధమైంది. ఏపీలో 500 అధునాతన బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోంది. అమెరికా పర్యటనకు ముందు ముంబైలో పలువురు పారిశ్రామిక వేత్తలతో లోకేశ్ భేటీ అయ్యారు. ఆ సమయంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ, రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి నేతృత్వం వహిస్తున్న అనంత్ అంబానీని కూడా కలిశారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రంలో పెట్టబడులకు సంబంధించి అనంత్ అంబానీ, లోకేశ్ మధ్య అప్పుడే ఓ అవగాహన కుదిరింది. రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తిస్థాయి రోడ్ మ్యాప్‌తో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అమరావతిలో ఏపీ పరిశ్రమల శాఖ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. లోకేశ్ కృషితో ఇప్పటికే ఏపీలో సౌర, పవన విద్యుత్ రంగంలో రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టాటా పవర్ ముందుకు వచ్చింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఎటువంటి హడావుడి లేకుండా లోకేశ్ జరుపుతున్న చర్చలపై దేశవ్యాప్తంగా పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ దిగ్గజం ఆదిత్య మిట్టల్‌తో ఒక్క వీడియో కాన్ఫరెన్స్‌తో రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడిని ఖరారు చేయడం, తాజాగా రిలయన్స్ పెట్టుబడులపై ఏపీ పారిశ్రామక వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. రిలయన్స్ పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,50,000 మంది ఉపాధి అవశాకాలు లభించనున్నాయి. క్లీన్ ఎనర్జీ రంగంలో పెట్టబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నిస్తోందని తెలుసుకున్న లోకేశ్ వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ఒక మిషన్ మోడ్‌లో పనిచేశారు. ముంబైలో చర్చల తర్వాత కేవలం 30 రోజుల వ్యవధిలోనే పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. ‘ఏపీ ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్’కు ఈ పెట్టుబడులే నిదర్శనం. అనేక ప్రోత్సాహకాలతో ఏపీ ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చింది. క్లీన్ ఎనర్జీ రంగంలో పెట్టబడులు తీసుకువచ్చి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారు.
Also Read : సుప్రీంలో జగన్ అక్రమాస్తుల కేసు మరో ధర్మాసనానికి
Admin
Studio18 News