Saturday, 07 March 2026 07:56:13 PM
# కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు # జగిత్యాలపై చిన్నచూపు ఎందుకు..? # గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

రోజా, వైసీపీ కలిసి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు: షర్మిల ఆవేదన

Date : 10 June 2025 08:35 PM Views : 306

Studio18 News - ANDHRA PRADESH / : సీఎం చంద్రబాబుకు తాను మద్దతు పలుకుతున్నానంటూ వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ, రోజాపై నిప్పులు చెరిగారు. రోజా ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. వైసీపీ నేతలు తనపై, తన తల్లి విజయమ్మపై గతంలో చేసిన దారుణమైన ప్రచారాన్ని గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందారు. "రోజా, వైసీపీ కలిసి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు. నా రక్త సంబంధమే నా మీద విష ప్రచారం చేసింది. నేను వైఎస్సార్‌కే పుట్టలేదని దారుణంగా ప్రచారం చేశారు. విజయమ్మకు నేను అక్రమ సంతానం అని కూడా ప్రచారం చేశారు. మీరు చేసిన ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యల వల్ల నేను ఎంతగా మానసిక క్షోభ అనుభవించి ఉంటానో ఆలోచించండి" అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన సోదరుడు కష్టాల్లో ఉన్నారని తెలియగానే, రక్త సంబంధానికి విలువ ఇచ్చి 3,200 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశానని షర్మిల గుర్తుచేశారు. "మీరు మనుషులు కాదు. రక్త సంబంధం గురించి మాట్లాడటానికి మీకు సిగ్గుండాలి. విజయమ్మను పార్టీ నుంచి బయటకు పంపిన రోజే మీ పతనానికి పునాది పడింది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలని కోరుతున్నాను" అని వైసీపీ నేతలను ఉద్దేశించి షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమస్యలపై జరిగే ప్రజా పోరాటాలకు మాత్రమే తన మద్దతు ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, ప్రజల పక్షాన నిలబడతానని ఆమె పునరుద్ఘాటించారు. షర్మిల వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :