Studio18 News - ANDHRA PRADESH / : తిరుమలలో భక్తులను శ్రీవారి దర్శనానికి పంపించే విషయంలో అవినీతి జరిగిందని మనం ఇప్పటి వరకు విన్నామని, కానీ స్వామివారి ప్రసాదం తయారీలో కూడా ఇంతటి అవినీతి జరగడమా? అని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని వైసీపీ అధినేత జగన్‌కు సూచించారు. హైదరాబాద్‌లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై స్పందించారు. సీబీఐ విచారణ ప్రధాని మోదీ చేతిలోనే ఉందన్నారు. కాబట్టి ఈ ఘటనపై కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరగాలన్నారు. శ్రీవారి విషయంలో తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడాలన్నారు. శ్రీవారి ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో చేప నూనె, ఎద్దు కొవ్వు కలిపారని అంతా అంటున్నారని, ఇంతటి అపచారం తాను ఎప్పుడూ చూడలేదన్నారు.
Admin
Studio18 News