Sunday, 08 March 2026 03:29:05 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Pushpa 2 Dialogue: ఎగ్జామ్ సెంటర్ గోడపై పుష్ప-2 డైలాగ్.. మండిపడుతున్న నెటిజన్లు

ఇన్విజిలేటర్ ను ఉద్దేశించి విద్యార్థుల రాతలు పనికిమాలిన సినిమాలు చూస్తే ఇలాగే తయారవుతారని కామెంట్లు సిగ్గుపడాల్సిన విషయమని ఓ నెటిజన్ ఆవేదన

Date : 19 March 2025 01:09 PM Views : 283

Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల్లో ఓ ఆకతాయి చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పరీక్ష కేంద్రం గోడపై పుష్ప సినిమా డైలాగును అనుకరిస్తూ, ఇన్విజిలేటర్ ను కించపరిచేలా రాయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు అందుబాటులో లేనప్పటికీ సదరు రాతలకు సంబంధించిన ఫొటోను ఓ యూజర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. పుష్ప 2 సినిమాలోని ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేటూ’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ను సదరు ఆకతాయి పేరడీ చేశాడు. ‘దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్.. నీయవ్వ తగ్గేదేలే..’ అంటూ గోడపై రాశాడు. దీనిని ఫొటో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ‘ఇదీ నేటి యువత తీరు’ అంటూ ఓ యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. పనికిమాలిన సినిమాలు చూస్తే పిల్లలు ఇలానే తయారవుతారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని, ఇలాంటివి జోక్‌గా తీసుకోవడం సరికాదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :