Thursday, 12 March 2026 01:33:09 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

పదో తరగతి విద్యార్థులు తెలుగులో కూడా పరీక్షలు రాసుకోవచ్చు.. అవకాశమిచ్చిన ఏపీ ప్రభుత్వం

2020-21లో 1 నుంచి 6 తరగతులను ఒకేసారి ఇంగ్లిష్ మీడియంలోకి మార్చిన గత ప్రభుత్వం ఆ తర్వాత ఒక్కో క్లాసును ఇంగ్లిష్‌లోకి మార్చిన వైనం ఇంగ్లిష్ చాలా పా

Date : 21 November 2024 10:58 AM Views : 601

Studio18 News - ANDHRA PRADESH / : ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారు కావాలనుకుంటే పబ్లిక్ పరీక్షలు తెలుగు మాధ్యంలోనే రాసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుల్లో ఈ మేరకు సవరణలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఇది ఈ ఒక్క ఏడాదికే పరిమితం కానుంది. 2020-21లో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతులను ఇంగ్లిష్ మాధ్యమంలోకి మార్చుతూ అప్పటి సర్కారు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత ఒక్కో తరగతిని ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతున్నట్టు ప్రకటిస్తూ పదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన విధించింది. అయితే, సుప్రీంకోర్టులో ఈ విషయమై కేసు దాఖలు ‘కావడంతో ‘ఇంగ్లిష్ మీడియం అని చెప్పకుండా ‘ఒకే మాధ్యమం’ ఉండాలని ఆదేశించింది. ఒకే మాధ్యమం అని చెప్పి, అది ఏ మాధ్యమం అన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో చాలా పాఠశాల్లలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం రెండింటినీ కొనసాగించారు. ఈ నేపథ్యంలో తెలుగులో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలంటూ ఉపాధ్యాయులు కోరడంతో స్పందించిన ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికి తెలుగులో పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read : రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులిచ్చిన పోలీసులు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :