Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును కూటమి ప్రభుత్వం నియమించింది. నామినేటెడ్ పదవుల నియామకానికి సంబంధించిన జాబితాను ప్రభుత్వం నేడు విడుదల చేసింది. చాగంటిని నైతిక విలువల సలహాదారుగా నియమించారు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను సర్దుబాటు చేశారు. దీంతో పలువురు ఆశావహులకు టికెట్ దక్కలేదు. అప్పుడు టికెట్ దక్కని నేతలకు ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులలో ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన నియామకపు ఉత్తర్వులతో జీవో విడుదల చేసింది.
Admin
Studio18 News