Thursday, 12 December 2024 02:09:18 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

మాది లంచాల ప్రభుత్వం కాదు: “పల్లె పండుగ”లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Date : 14 October 2024 03:10 PM Views : 22

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కూటమి సర్కారు ఇవాళ పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కృష్ణాజిల్లా కంకిపాడు నుంచి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. గతంలో కేటాయించిన నిధులు ఏమయ్యాయో తెలియదని అన్నారు. తమది లంచాల ప్రభుత్వం కాదని, మంచి ప్రభుత్వమని చెప్పారు. పరిపాలన ఎలా చెయ్యాలనే విషయంలో చంద్రబాబే తనకు స్ఫూర్తి అని తెలిపారు. పరిపాలన అనుభవం కావాలంటే ఎంతో కృషిచేయాలనని అన్నారు. ప్రభుత్వ పనిలో గుట్టు ఎందుకని అంతా పారదర్శకంగా ఉండాలని పవన్ కల్యాణ్ చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదని, ఏరోజూ… గ్రామసభలు, తీర్మానాలు చేయలేదని అన్నారు. తాను వచ్చాక సమీక్ష చేసినా కూడా ఆ నిధుల జాడ లేకుండా పోయిందని తెలిపారు. గతంలో కేటాయించిన నిధులు ఏమయ్యాయో తెలీదని అన్నారు. తాము శాఖల వారీగా సమీక్షలు చేసి వాస్తవాలు చెప్పాలని భావించామని చెప్పారు. సినిమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. “ముందు బాధ్యతలు.. ఆ తర్వాతే సినిమాలు.. టాలీవుడ్‌లో ఎవరితోనూ నేను పోటీపడను.. నేను సినిమా చేయాలంటే డబ్బులు కూడా ఉండాలి.. సినిమా హీరోలు ఎవరైనా బాగుండాలని కోరుకుంటా.. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలి.. రాష్ట్రాన్ని బాగుచేసుకుని ఆ తర్వాత విందులు, వినోదాలు చేసుకుందాం” అని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు