Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Ttd Laddu Row : తిరుమల లడ్డూ వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. పొలిటికల్ యాంగిల్ తీసుకుంది. శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిందన్న సీఎం చంద్రబాబు ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో తిరుమలను అపవిత్రం చేశారని చంద్రబాబు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర వివాదం నడుస్తున్న వేళ.. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చారు జగన్. ఈ మేరకు వైసీపీ శ్రేణులు పూజలు చేయాలన్నారు. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డూ, వెంకన్న విశిష్టతను అపవిత్రం చేశారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు చేయాలన్నారు జగన్. వైసీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు. అదే సమయంలో జగన్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 28న ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాలి నడకన తిరుమలకు చేరుకుని పూజలు నిర్వహించనున్నారు. అదే రోజున పార్టీ నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Admin
Studio18 News