Monday, 08 December 2025 03:51:42 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Kakani Govardhan Reddy: అదే జరిగితే టీడీపీ ఇక రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుంది: కాకాణి గోవర్ధన్

Date : 15 October 2024 05:06 PM Views : 271

Studio18 News - ANDHRA PRADESH / : జమిలి ఎన్నికలపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు జరిగేట్టయితే, టీడీపీ ఇక రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని అన్నారు. ఈ లోపు టీడీపీ నేతలు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవద్దని, వారి మాటలు వినే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కొత్త మద్యం దుకాణాల్లో 90 శాతం టీడీపీ నేతలకే దక్కాయని కాకాణి అన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే లాటరీ ప్రక్రియ కొనసాగిందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే షాపుల ఎంపిక జరిగిందని అన్నారు. ఎల్లో బ్యాచ్ బాగు కోసమే చంద్రబాబు మద్యం పాలసీని ప్రకటించారని విమర్శించారు. రాష్ట్రంలోని డిస్టిలరీలన్నీ టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఉన్నాయని... నాసిరకం మద్యాన్ని తక్కువ ధరకు అమ్ముతారని చెప్పారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా రానున్నాయని కాకాణి అన్నారు. రాబోయే రోజుల్లో లిక్కర్ ను డోర్ డెలివరీ కూడా చేస్తారని చెప్పారు. మద్యం దుకాణాల కేటాయింపుల్లో చంద్రబాబు మూడంచెల విధానాన్ని అమలు చేస్తారని అన్నారు. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులతో కింది స్థాయి నాయకులు దోచుకుంటారని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :