Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి తమను కించపరిచేలా మాట్లాడుతున్నారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మీడియా ప్రతినిధులు పలు ఆధారాలతో ఇటీవల సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో కొలికపూడి ఈరోజు సాయంత్రం చేపట్టిన 'సేవ్ తిరువూరు' ర్యాలీని రద్దు చేసుకున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో ర్యాలీ విరమించుకున్నారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో 'సేవ్ తిరువూరు' పేరుతో ర్యాలీకి కొలికపూడి పిలుపునిచ్చారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కొలికపూడి ర్యాలీకి బ్రేక్ పడింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తనను ర్యాలీ విరమించుకోవాలని ఆదేశించారని, దీంతో ర్యాలీ విరమించుకున్నట్లు కొలికపూడి ఆదివారం సాయంత్రం వీడియో విడుదల చేశారు.
Admin
Studio18 News