Sunday, 08 March 2026 09:43:08 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ

Date : 30 June 2025 10:38 AM Views : 1445

Studio18 News - ANDHRA PRADESH / : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో వారాహి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న తెలంగాణ రాష్ట్రం నుండి అమ్మవారికి బంగారు బోనం సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ నుండి వచ్చిన కమిటీ సభ్యులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దుర్గ టెంపుల్ ఈవో శీనానాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కమిటీ సభ్యులు బ్రాహ్మణ వీధిలోని దేవస్థాన ఉద్యోగుల కార్యాలయం నుండి డప్పు కళాకారుల నృత్యాల నడుమ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం చూపించిన అనంతరం మల్లికార్జున మహామండపంలో దేవస్థాన వైదిక కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి గురునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :