Studio18 News - ANDHRA PRADESH / : ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (మంగళవారం) ఢిల్లీ వెళుతున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణాలకు ప్రపంచ బ్యాంకు సహా అనేక ఆర్ధిక సంస్థల నుంచి నిధులను సమీకరిస్తున్న విషయం తెలిసిందే. రెండు ప్రతిష్ఠాత్మకమైన బ్యాంకులతో పాటు హడ్కో కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. దీంతో అమరావతిలో అనేక నిర్మాణాలు చేపట్టేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను సీఆర్డీఏ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మోదీని అహ్వానించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి టీడీపీ ఎంపీలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. మరో పక్క ఈ రోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం కానుంది. అమరావతి నిర్మాణాల కోసం సీఆర్డీఏ ఆమోదించిన టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
Admin
Studio18 News