Friday, 13 December 2024 09:49:23 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

CPI Narayana: తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై సీపీఐ నారాయణ ఏమన్నారంటే...!

Date : 24 September 2024 05:07 PM Views : 27

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొన్ని రోజులుగా తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా ఈ అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సహజంగానే ధర తగ్గినప్పుడు నాణ్యత కూడా తగ్గుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై అంతులేని అవినీతి జరిగిందని ఆరోపించారు. దొడ్డిదారిన ఈవో పోస్టులు ఇచ్చి, భక్తుల విశ్వాసాలకు విఘాతం కలిగే చర్యలకు అవకాశం ఇచ్చారని విమర్శించారు. దోపిడీదారులకు పాలకమండలి పదవులు కట్టబెట్టారని నారాయణ మండిపడ్డారు. "జగన్ ముఖ్యమంత్రి కాగానే రివర్స్ టెండర్లు అనే కొత్త పాలసీ తీసుకువచ్చాడు. ఆ పాలసీ పూర్తిగా విఫలం కావడమే కాదు, నష్టదాయకంగా మారింది. పోలవరంలో ఏం జరిగిందో చూశాం. రివర్స్ టెండరింగ్ అన్నాడు, కాంట్రాక్టర్లను మార్చాడు... మరి ఎంత మిగిల్చాడు? తిరుపతిలోనూ లడ్డూల నెయ్యి విషయంలో రివర్స్ టెండరింగ్ పెట్టాడు. పాత పద్ధతి తీసేసి కొత్త పద్ధతి పెట్టాడు. అప్పుడు నెయ్యి రూ.500 ఉంటే, దాన్ని రూ.320కి వచ్చేలా చేశాడు. ఎప్పుడైనా నాణ్యత తగ్గితే, రేటు కూడా తక్కువగానే ఉంటుంది. నాణ్యత పెరిగితే రేట్లు పెరుగుతాయి. నెయ్యి విషయంలోనూ అదే జరిగింది. ధర తగ్గడం వల్ల కల్తీకి అవకాశం ఏర్పడింది. ఈ విషయం కాస్తా ల్యాబరేటరీకి వెళ్లింది... ల్యాబరేటరీ వాళ్లు అది ఆవు నెయ్యి కాదని, కల్తీ నెయ్యి అని చెప్పేశారు" అని వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు