Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు హైదరాబాద్ వెళ్లిన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు... హైదరాబాదులోని రామ్ గోపాల్ వర్మ నివాసంలో నోటీసులు అందించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ వర్మపై టీడీపీ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనపై మూడ్రోజుల కింద మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. ఈ క్రమంలో, నవంబరు 19న మద్దిపాడు పీఎస్ లో విచారణకు రావాలంటూ పోలీసులు ఇవాళ నోటీసులు అందించారు. వర్మ స్వయంగా నోటీసులు అందుకున్నారు.
Also Read : మా కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు: వివేక్
Admin
Studio18 News