Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Ttd Laddu Row : ఏపీలో సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదం వ్యవహారంపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐజీ లేదా ఆ పైస్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామన్నారాయన. సిట్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామి వారి పవిత్రను ఎవరూ మలినం చేయలేరన్న చంద్రబాబు.. తిరుమలకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. ”ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ లేదా ఆపైస్థాయి అధికారితో సిట్ వేస్తాం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మొత్తం వ్యవహారంపై దర్యాఫ్తు చేస్తుంది. జరిగిన అపవిత్రం, అధికార దుర్వినియోగం ఇవన్నీ అనలైజ్ చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్టు ఇస్తారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. తద్వారా భవిష్యత్తుల్లో ఇలాంటివి జరక్కుండా ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. * దోష నివారణకు శాంతియాగం, పంచద్రవ్య సంప్రోక్షణ నిర్వహిస్తున్నాం. * ఐజీ స్థాయి లేదా ఆపైస్థాయి అధికారి ఆధ్వర్యంలో మొత్తం వ్యవహారంపై సిట్ వేస్తాం. * తిరుమల పవిత్రను కాపాడటం అందరి బాధ్యత. * తిరుమల పవిత్రను కాడటం కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం. అటు.. తిరుమల లడ్డూ అపవిత్రతపై సిట్ ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. ప్రస్తుతం నందిని, ఆల్ఫా సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కిలో రూ.475కు కొంటున్నామని తెలిపారు. దోషాలను తొలగించేందుకు ఇప్పటికే పాప ప్రోక్షణ హోమాలు నిర్వహించామని ఈవో వెల్లడించారు. అంతేకాదు త్వరలోనే తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఎల్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తామని ఈవో శ్యామలరావు చెప్పారు.
Admin
Studio18 News