Thursday, 12 March 2026 12:24:50 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

APSDMA: బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం... రేపు మరో అల్పపీడనం

Date : 23 October 2025 07:49 PM Views : 161

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ఉత్తర తమిళనాడుపై ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనం రాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు రేపు ఏర్పడనున్న కొత్త అల్పపీడనం మరింత బలపడే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచనw ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడనాల ప్రభావం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండగా, రేపు మరో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. ఇది రానున్న 24 గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక వైపు కదులుతూ మరింత బలహీనపడనుంది. అయినప్పటికీ, దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలకు దూరంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో మరో వాతావరణ మార్పు చోటుచేసుకోనుంది. దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని కారణంగా శుక్రవారం (రేపు) ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ఏర్పడిన తర్వాత 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :