Studio18 News - ANDHRA PRADESH / : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కనకదుర్గ అమ్మవారు .. మహిషాసురమర్దని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మహిషాసుర సంహారం జరిగిన రోజునే మహర్నవమిగా జరుపుకోవడం ఆనవాయతీ. ఈ రోజున చండీ సప్తశతీ హోమం చేసిన వారికి శత్రుభయం ఉండదని, అన్నింటా విజయం కలుగుతుందని పండితులు చెబుతుంటారు. ఉత్సవాలు రేపటితో ముగుస్తుండటంతో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం సాయంత్రం కృష్ణానదిలో హంస వాహనంపై దుర్గామల్లేశ్వరులను జల విహారం చేయించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Admin
Studio18 News