Studio18 News - ANDHRA PRADESH / : ఫ్యూచర్లో అడ్డంకులు రావొద్దు. అపోహలకు కూడా తావు లేదు. సగటు ఆంధ్రుడు ఏపీ రాజధాని అంటే అమరావతి అని గర్వంగా చెప్పుకోవాల్సిందే. గత ఐదేళ్లలో జరిగిన డ్యామేజ్ చాలు. మళ్లీ అలాంటి సీన్ రిపీట్ కావొద్దు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రెండోసారి నవ్యాంధ్రకు సీఎం అయినప్పటి నుంచి రాజధాని విషయంలో పకడ్బందీ వ్యూహ రచన చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతే. ఫిక్స్ అయిపోండి అంటూ క్లారిటీ ఇస్తోంది. అందుకోసం అమరావతికి కేంద్రం ఆమోదంతో గెజిట్ ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. అంతేకాదు ఎన్డీయే సర్కార్లో భాగస్వామిగా ఉండటంతో ఇప్పటికే 15వేల కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించారు చంద్రబాబు. మరో పన్నెండు వేల కోట్ల రూపాయలు వివిధ ఏజెన్సీల ద్వారా వస్తాయని కూడా చెబుతున్నారు. ఇంకా మిగతా ప్రాజెక్టుల కోసం కూడా నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతున్నారు. ఈ క్రమంలోనే మూడేళ్లలో అమరావతి రాజధాని పనులు కంప్లీట్ చేస్తామని చెప్తోంది కూటమి సర్కార్. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతే రాజధాని అని శాసనసభలో తీర్మానం చేసింది. టీడీపీ అయిదేళ్ళ పాలనలో అమరావతి రాజధానిగానే చాలా కార్యక్రమాలు చేపట్టారు. క్యాపిటల్ సిటీ నిర్మాణంపై గొప్పగా డిజైన్లు తీర్చిదిద్దారు. అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయాలని ప్లాన్స్ రూపొందించారు. ప్రధాని మోదీని ఆహ్వానించి..రాజధాని పనులను గొప్పగా ప్రారంభించారు. సెక్రటేరియట్తో పాటు కొన్ని బిల్డింగ్స్ పనులు కూడా పూర్తయ్యాయి.
Admin
Studio18 News