Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేటలో టీడీపీ నేత దారుణహత్యకు గురయ్యారు. ఇంట్లో నిద్రిస్తున్న ఆయనపై దుండగులు పెట్రోలు పోసి నిప్పటించారు. రాజకీయ కక్షలే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వారి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన టీడీపీ నేత మల్లారపు హరిప్రసాద్ (20) గత రాత్రి తన బంధువు చెలగల కాటయ్యతో కలిసి బయటకు వెళ్లారు. అర్ధరాత్రి తర్వాత ఇంటికి చేరుకున్న ఆయన గాఢ నిద్రలో ఉండగా కొందరు వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వైసీపీకి చెందిన కట్టా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దుంపల మధు, ఆయన సహచరులు ఈ దాడికి పాల్పడినట్టు బాధితులు ఆరోపించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Studio18 News