Thursday, 12 December 2024 12:44:34 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. పదవులు దక్కిన వారు వీరే..

Date : 24 September 2024 02:10 PM Views : 27

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : AP Nominated Posts : ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీకోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. కాగా మంగళవారం ఏపీ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. మొత్తం 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల లిస్ట్ ను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ ఎస్టీలకు పెద్దపీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇంఛార్జిలు, ఒక క్లస్టర్ ఇంచార్జ్ కు చైర్మన్ పదవి వరించింది. ఆరుగురు యూనిట్ ఇంచార్జులకు పదవులు దక్కాయి. 20 కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమించిన కూటమి ప్రభుత్వం.. ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్లకు సభ్యులను నియమించింది. అయితే, 20 కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 16మంది టీడీపీ నేతలు, ముగ్గురు జనసేన నేతలు, ఒక బీజేపీ నేతకు అవకాశం దక్కింది. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు పదవులు కట్టబెట్టారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కిన వారు వీరే.. వక్ఫ్ బోర్డు చైర్మన్ – అబ్దుల్ అజీజ్ (టీడీపీ) శాప్ చైర్మన్ – అనిమిని రవి నాయుడు (టీడీపీ) గృహనిర్మాణ సంస్థ చైర్మన్ – బత్తుల తాతయ్య బాబు (టీడీపీ) ఏపీ ట్రైకార్ చైర్మన్ – బొరగం శ్రీనివాసులు (టీడీపీ) ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ – దామచర్ల సత్య (టీడీపీ) సీడాప్ చైర్మన్ – దీపక్ రెడ్డి (టీడీపీ) మార్క్ ఫెడ్ చైర్మన్ – కర్రోతు బంగార్రాజు (టీడీపీ) సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ – మన్నె సుబ్బారెడ్డి (టీడీపీ) ఏపీఐఐసీ చైర్మన్ – మంతెన రామరాజు (టీడీపీ) పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ : నందం అబద్దయ్య (టీడీపీ) ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ – నూకసాని బాలాజీ (టీడీపీ) ఏపీ ఆర్టీసీ చైర్మన్ – కొనకళ్ల నారాయణ, వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం (టీడీపీ) పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ – పీలా గోవింద సత్యనారాయణ (టీడీపీ) లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ – పిల్లి మాణిక్యాల రావు (టీడీపీ) వినియోగదారుల రక్షణ కౌన్సిల్ చైర్మన్ – పీతల సుజాత (టీడీపీ) ఏపీటీపీసీ చైర్మన్ – వజ్జ బాబూరావు (టీడీపీ) ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్ – తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన) పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ – తోట మెహర్ సీతారామ సుధీర్ (జనసేన) ఏపీ టిడ్కో చైర్మన్ – వేములపాటి అజయ్ కుమార్ (జనసేన) 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ – లంకా దినకర్ (బీజేపీ)

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు