Thursday, 12 March 2026 01:09:50 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర!

Date : 07 February 2026 07:39 PM Views : 139

Studio18 News - ANDHRA PRADESH / Chittoor : మైనర్ బాలుడితో 37 ఏళ్ల వివాహిత అక్రమ సంబంధం సంబంధానికి అడ్డుగా ఉన్నారని భర్త, అత్త హత్యకు కుట్ర ప్రియుడితో కలిసి అత్తపై కత్తితో దాడి చేయించిన మహిళ ప్రజలు రావడంతో విఫలమైన హత్యాయత్నం, బాలుడు అరెస్ట్ పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు కవిత, పోలీసుల గాలింపు చిత్తూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన కంటే 20 ఏళ్లు చిన్నవాడైన మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, తమ బంధానికి అడ్డుగా ఉన్నారని భావించి భర్తను, అత్తను హత్య చేయించేందుకు ప్రయత్నించింది. ప్రియుడి చేత అత్తపై దాడి చేయించగా, ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు నగరం చామంతిపురానికి చెందిన కవిత (37)కు 17 ఏళ్ల క్రితం విజయ్‌తో వివాహమైంది. వీరికి 14, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కవిత అదే ప్రాంతంలో నివసించే 17 ఏళ్ల బాలుడితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న భర్త విజయ్‌, అత్త నిర్మల పలుమార్లు ఆమెను హెచ్చరించారు. దీంతో వారిపై కక్ష పెంచుకున్న కవిత, తన సంబంధానికి అడ్డుగా ఉన్న ఇద్దరినీ చంపేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే భర్తను, అత్తను హత్య చేయాలంటూ తన ప్రియుడైన మైనర్ బాలుడిని రెచ్చగొట్టింది. ఆమె మాటలు నమ్మిన బాలుడు, ఈ నెల‌ 5వ తేదీ రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న నిర్మలపై దాడికి తెగబడ్డాడు. ఆమె కళ్లల్లో కారం చల్లి, కత్తితో గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించాడు. అయితే, నిర్మల అతడిని గట్టిగా ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. జనాలను చూసి భయపడిన బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన నిర్మలను స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, నిందితుడైన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కవిత రెచ్చగొట్టడం వల్లే తాను ఈ దాడికి పాల్పడినట్లు బాలుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కవిత పరారీలో ఉందని, ఆమె కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :