Sunday, 08 March 2026 03:25:33 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి

Date : 02 September 2025 07:51 PM Views : 325

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన మాజీ ఎంఈ విజయసాయి ఆయురారోగ్యాలతో దేశానికి సేవ చేయాలని ఆకాంక్ష జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయాలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఇరువురు నేతల మధ్య ఈ రకమైన అభినందనలు చోటుచేసుకోవడం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది. మంగళవారం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో, దేశానికి సేవ చేసే శక్తితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ మేరకు #HBDPawanKalyan అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయసాయి వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆయన వదులుకున్నారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని విజయసాయి చెప్పినప్పటికీ, భవిష్యత్తులో ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పడు పవన్ కు విషెస్ తెలపడం ద్వారా మరోసారి ఆయన తన రాజకీయ భవితవ్యంపై చర్చకు అవకాశం ఇచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :