Sunday, 08 March 2026 10:36:40 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Vallabaneni Vamsi: ఏప్రిల్ 1 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్ .. గన్నవరం కోర్టు ఆదేశాలు

పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి వంశీని గన్నవరం కోర్టులో హాజరుపర్చిన పోలీసులు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధింపు జైలులో పరుపు, ఫైబర్ కుర్చీ ఏర్పాటునకు వంశీ వి

Date : 19 March 2025 12:10 PM Views : 336

Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం కోర్టు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీని మంగళవారం గన్నవరం పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వంశీపై నమోదైన భూ రిజిస్ట్రేషన్ వివాదం కేసులో కోర్టు అనుమతితో పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారు. రిమాండ్ రిపోర్టుపై విచారణ జరిపిన గన్నవరం కోర్టు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించింది. ఈ సమయంలో తనకు జైలులో ఇనుప మంచం ఇచ్చారని, పరుపు, ఫైబర్ కుర్చీ ఏర్పాటుకు జైలు అధికారులకు ఆదేశించాలని వంశీ న్యాయమూర్తిని కోరారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణ జరిపిన నేపథ్యంలో తాను వాటిపై ఆదేశాలు ఇవ్వలేనని గన్నవరం కోర్టు తెలిపింది. మెడికల్ సర్టిఫికెట్లు పొందుపరిస్తే వాటి ఆధారంగా ఫైబర్ కుర్చీ ఏర్పాటు అంశంపై ఆదేశాలు ఇస్తామని కోర్టు తెలిపింది. విచారణ అనంతరం వంశీని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :