Sunday, 08 March 2026 10:28:38 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Polavaram: పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు.. అంచనాలను అథారిటీకి పంపించిన అధికారులు

Date : 02 October 2024 12:37 PM Views : 477

Studio18 News - ANDHRA PRADESH / : Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనులు 2026 మార్చికే పూర్తి చేయాలని కేంద్రం షరతు విధించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులు, పునరావాసం వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ. 30,436,95 కోట్లతో తాజా డీపీఆర్ ను ఆమోదించింది. దీని వల్ల ఈ ప్రాజెక్టు తొలిదశ పూర్తికి రూ. 12,157 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. తాజా డీపీఆర్ ఆమోదం తరువాత ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం కృషితో పోలవరానికి అడ్వాన్స్ గా నిధులిచ్చేందుకూ కేంద్రం ముందుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి రూ. 5,500 కోట్లు, ప్రధాన డ్యాం కాలువల్లో నిర్మాణ పనులకు రూ. 1,700 కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమని అధికారుల అంచనా వేశారు. ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలబెట్టాలి.. తొలిదశలో ఎనిమిది మండలాల పరిధిలో 172 నివాసాల్లో 38,060 మందికి పునరావాసం కల్పించాలి. ఇప్పటి వరకు 12,797 మందికి పునరావాసం కల్పించారు. ఇంకా 25,263 మందిని పునరావాస కేంద్రాల్లోకి తరలించాల్సి ఉంది. వీరికోసం 16,440 ఎకరాల భూమి సేకరించాలి. దీనికిగాను రూ. 2,435 కోట్లు అవసరం అవుతుంది. మరొకవైపు వీరందరికీ నిర్వాసిత ప్యాకేజీ కోసం రూ. 2,043.59 కోట్లు అవసరం అవుతుంది. అదేవిధంగా పునరావాస కాలనీల నిర్మాణానికి రూ. 3,314 కోట్లు కావాల్సి ఉంది. 2025 జూన్ నాటికి ఎంత వరకు చేయగలరో అంతవరకు చేయాలని కోరుతూ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. తక్షణం 5,500 కోట్లు కావాలంటూ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నవంబర్ నెలలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయి. కొత్త డయాఫ్రం వాల్ మట్టి సాంద్రత పెంపు.. ప్రధాన డ్యాం గ్యాప్-2లో పాత డయాఫ్రం వాల్ కు సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం దాదాపు 64వేల చదరపు మీటర్లు పని చేయాల్సి ఉంటుంది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. ఇందులో భాగంగా నవంబర్ నాటికి డిజైన్లు, ఇతర అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ప్రధాన డ్యాం మొదటి రెండు గ్యాప్ లలో మట్టి సాంద్రత పెంచే పనులు చేయాల్సి ఉంది. అక్కడ ఇసుకను నింపి వైబ్రో కాంపాక్షన్ ద్వారా అక్కడ మట్టి గట్టిదనం పెంచాల్సి ఉంది. ఇందుకు షెడ్యూలు కూడా పోలవరం అథారిటీకి అధికారులు సమర్పించారు. అనుసంధాన పనుల్లో ఎడమ టన్నెల్ హెడ్ రెగ్యులేటర్, ఎడమ టన్నెల్ లైనింగ్, కుడి టన్నెళ్లలో మట్టి తవ్వకం లైనింగ్ కూడా 2025 జూన్ నాటికి పూర్తి చేసేలా షెడ్యూల్ చేశారు. ఇంకా తొలిదశలో ఆయకట్టు నీళ్లించేలా కుడి, ఎడమ కాలువల్లో కూడా పనులు చేయాల్సి ఉంది. ప్రధాన డ్యాం, కాలువల్లో నిర్మాణ పనులకు రూ.1700 కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమని అధికారులు అంచనా వేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :