Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ను ఏలూరు జిల్లా వేలేరుపాడు పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారిస్తున్నారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఈ సాయంత్రం వరకు విచారణ కొనసాగనుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ లపై అసభ్య దూషణలు చేసిన నేపథ్యంలో పోలీసులు విచారిస్తున్నారు. ఉద్దగిరి రాణి అనే మహిళ రెండు నెలల క్రితం బోరుగడ్డ అనిల్ పై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ లో ఉన్నారు. తాజాగా ఆయనను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని వేలేరుపాడు పోలీసులు కోర్టును కోరగా... కోర్టు అందుకు అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు నిన్న రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వేలేరుపాడుకు పోలీసులు తరలించారు. ప్రస్తుతం ఆయన విచారణ కొనసాగుతోంది.
Also Read : నా క్లాస్ లో 99 శాతం మంది ఇండియన్లే.. ఇదేమన్నా స్కామా?.. అమెరికన్ స్టూడెంట్ ప్రశ్న
Admin
Studio18 News