Monday, 02 December 2024 04:32:36 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

R.Krishnaiah: వైసీపీకి ఆర్ కృష్ణయ్య గుడ్‌బై.. త్వరలో బీజేపీలో చేరిక?

Date : 23 September 2024 12:24 PM Views : 62

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం మూటగట్టుకున్న వైఎస్సార్ సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. మరికొందరు అదే దారిలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ రాజ్య సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీ ఈ విషయంలో మరింతగా ముందుకెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగా బీసీల్లో పట్టున్న సీనియర్ నేత ఆర్ కృష్ణయ్యను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా కృష్ణయ్యతో జరిపిన చర్చలు ఫలించినట్టు తెలిసింది. పార్టీ జాతీయ అగ్రనేత జరిపిన ఈ చర్చలు ఫలవంతమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ఆయనకు కీలక పదవి ఇవ్వనున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఆర్ కృష్ణయ్య దాదాపు పదేళ్లపాటు ఆరెస్సెస్, ఏబీవీపీలో పనిచేసిన నేపథ్యంలో ఆ సంస్థ ముఖ్యులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నెల 13న కృష్ణయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ఆయన పార్టీలో చేరబోతున్నారన్న వార్తలకు బలం చేకూరుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు