Thursday, 12 March 2026 01:20:49 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Pemmasani Chandrasekhar: పెమ్మసాని చంద్రశేఖర్ పై అంబటి రాంబాబు కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు

Date : 07 February 2026 06:34 PM Views : 27

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : అంబటి రాంబాబుపై పెమ్మసాని ఆదేశాలతో దాడి జరిగిందన్న మౌనిక బాగా చదువుకున్న వ్యక్తి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శ తన తండ్రి రెడ్ బుక్ కు భయపడే వ్యక్తి కాదని వ్యాఖ్య కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు కూతురు మౌనిక సంచలన వ్యాఖ్యలు చేశారు. పెమ్మసాని ఆదేశాలతో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యవేక్షణలో తన తండ్రిపై హత్యాయత్నం జరిగిందని ఆమె ఆరోపించారు. దాడికి పోలీసులు కూడా సహకరించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన గల్లా మాధవికి ఇంత అహంకారం పనికిరాదని మౌనిక చెప్పారు. న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కంటే మాధవి ఎక్కువ కాదని అన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ బాగా చదువుకున్న వ్యక్తి అని, విదేశాల నుంచి వచ్చారని... అలాంటి వ్యక్తి ఇక్కడి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి అంబటి రాంబాబు రెడ్ బుక్ కు భయపడే వ్యక్తి కాదని... లా అండ్ ఆర్డర్ పై గౌరవంతోనే ఆయన క్షమాపణ చెప్పారని అన్నారు. రెండు వేల మంది చుట్టుముట్టినా, రాళ్లు రువ్వినా తన తండ్రి ధైర్యంగా ఉన్నారని చెప్పారు. ఇంటి గోడకు గునపాలు దింపుతున్నా... వ్యవస్థపై నమ్మకంతోనే ఆయన ఇంట్లో కూర్చున్నారని తెలిపారు. కానీ, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తులు వచ్చి ఆడవాళ్లపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :