Saturday, 07 March 2026 08:57:51 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాం: చంద్రబాబు

మూడు పార్టీలను పవన్ కల్యాణ్ కలిపారన్న చంద్రబాబు ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని ముందే ఊహించామని వ్యాఖ్య కూటమి సుదీర్ఘకాలం కొనసాగుతుందన్న

Date : 16 November 2024 03:56 PM Views : 304

Studio18 News - ANDHRA PRADESH / : ప్రధాని మోదీ తమ నాయకుడని, ఆయన నాయకత్వంలో తామంతా ముందుకు సాగుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలో హర్యానా సీఎం ప్రమాణస్వీకారం జరిగిన తర్వాత ఎన్డీయే కూటమి సీఎంలతో మోదీ భేటీ అయ్యారని... ఆ సమావేశం నాలుగు గంటల సేపు కొనసాగిందని చంద్రబాబు తెలిపారు. 2029 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలని ఆ సమావేశంలో మోదీ అందరి అభిప్రాయాలను తీసుకున్నారని చెప్పారు. ఏపీలో 2029 ఎన్నికల కోసం తాము ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీలను కలిపారని చెప్పారు. దాని ఫలితాన్ని ఎన్నికల్లో మనం చూశామని అన్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని తాము ముందుగానే ఊహించామని చెప్పారు. కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని... అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని అన్నారు. కూటమి సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుందని చెప్పారు. సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయని... మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అలాంటి వారిని ఉపేక్షించకూడదని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :