Sunday, 08 February 2026 10:09:15 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Nara Lokesh: రాష్ట్ర ప్రగతిలో సీఏలు మార్గదర్శకులు కావాలి: మంత్రి నారా లోకేశ్‌

Date : 29 August 2025 07:37 PM Views : 296

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమ‌న్న మంత్రి రాష్ట్ర అభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్లు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని వ్యాఖ్య‌ ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామ‌న్న లోకేశ్‌ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారతాయని వెల్ల‌డి విశాఖకు గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు వ‌స్తున్నాయ‌న్న మంత్రి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ బృహత్తర ప్రయాణంలో చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏలు) కేవలం భాగస్వాములుగా కాకుండా మార్గదర్శకులుగా నిలవాలని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించిన ‘అర్థసమృద్ధి–2025’ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని లోకేశ్‌ తెలిపారు. సీఏలు కేవలం ఖాతా పుస్తకాలు సరిచూసే ఆడిటర్లు మాత్రమే కాదని, బాధ్యతకు, జవాబుదారీతనానికి ప్రతిరూపాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి బ్రాండ్ అంబాసడర్లుగా మారి, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో నైతిక సలహాలు అందించాలని కోరారు. విశాఖపట్నంలో అకౌంటింగ్, ఆడిటింగ్ రంగంలో ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటుకు ఐసీఏఐ చొరవ చూపాలని సూచించారు. ఒకే రాజధాని.. ప్రాంతీయ అభివృద్ధి ‘ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ’ అనే నినాదంతో తాము ముందుకెళ్తున్నామని లోకేశ్‌ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. అనంతపురంలో ఆటోమోటివ్, కర్నూలులో పునరుత్పాదక ఇంధనం, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. మరో ఏడాదిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల స్వరూపం పూర్తిగా మారిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. పాలనలో సాంకేతికతకు పెద్దపీట పరిపాలనలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఏఐ ఆధారిత పాలన ద్వారా ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇప్పటికే ‘మనమిత్ర’ ద్వారా 700 రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాల వల్లే గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఐసీఏఐ ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్, ఇతర ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :