Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ముస్తాబైంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు రేపు (అక్టోబరు 4) లాంఛనంగా స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఎల్లుండి (అక్టోబరు 5)న కూడా చంద్రబాబు దంపతులు బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు. వారు పెద శేష వాహన సేవలో పాల్గొంటారు.
Admin
Studio18 News