Thursday, 12 March 2026 12:19:21 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Mithun Reddy: అది మా చట్టబద్ధమైన భూమి: పవన్‌పై మిథున్ రెడ్డి ఫైర్

Date : 13 November 2025 06:08 PM Views : 123

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : పెద్దిరెడ్డి భూకబ్జాలపై పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి పవన్ ఆరోపణలపై స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ ఆ భూమి 2000లోనే చట్టబద్ధంగా కొన్నామన్న మిథున్ రెడ్డి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారంటూ పవన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తూర్పు కనుమల పరిధిలోని మంగళం పేటలో అటవీ భూములను ఆక్రమించారని ఆరోపిస్తూ డిప్యూటీ సీఎం పవన్ హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ భూ కబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర విచారణ జరిపించాలని కూడా ఆయన కోరారు. పవన్ కల్యాణ్ ఆరోపణలపై పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి 'ఎక్స్' వేదికగా స్పందించారు. "పవన్ కల్యాణ్ గారూ, గతంలో ఎర్రచందనం విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? ఇప్పుడు హెలికాప్టర్‌లో నుంచి మీరు చూపించిన భూమి మా చట్టబద్ధమైన సొత్తు. ఆ భూమిని మేము 2000 సంవత్సరంలోనే కొనుగోలు చేశాం" అని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :