Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : విశాఖ నగరంలో స్కూల్, కాలేజీ విద్యార్ధులే టార్గెట్‌గా చేసుకుని గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలపై పోలీసుల నిఘా కొనసాగుతున్నా విక్రేతలు కొత్త ఫంథాలను ఎంచుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి చాక్లెట్లను ఇచ్చి యువతను వ్యసనపరులుగా మారుస్తున్నారు. విశాఖ నగరంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గంజాయి చాక్లెట్లు వెలుగు చూడటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది తీవ్ర కలకలాన్ని రేపుతోంది. విశాఖ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాపులో తనిఖీ చేసి, 660 గ్రాముల 133 గంజాయి చాక్లెట్ లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Studio18 News