Wednesday, 25 June 2025 07:00:19 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

ఇప్పటికీ వారిలో మార్పు లేదు... ఇక ఊరుకోను: మంత్రి నారా లోకేశ్

Date : 09 June 2025 08:11 PM Views : 89

Studio18 News - ANDHRA PRADESH / : తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం ఒక కుటుంబం. కోటిమంది సభ్యులున్న కుటుంబం... కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరగకపోవచ్చు... నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పార్వతీపురం సమీపంలోని చినబొండపల్లిలో టీడీపీ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ.... "ఇప్పటికీ కొందరు అధికారుల్లో మార్పు కన్పించడం లేదు, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటా, ఇక ఊరుకునేది లేదు... ఉద్దేశపూర్వకంగా టిడిపి కేడర్ ను ఇబ్బంది పెట్టేవారిపై కఠినంగా వ్యవహరిస్తా" అని స్పష్టం చేశారు. 6 శాసనాలు నరనరాన ఎక్కించాలి యువగళం పాదయాత్ర చేసినపుడు మీ ప్రాంతానికి రాలేకపోయా, విశాఖ వరకు వచ్చి ఆగిపోయాను. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్రగా రావాలని భావించా, బాబుగారి అరెస్టు వల్ల ఆపాల్సి వచ్చింది. శంఖారావం కార్యక్రమంలో మీవద్దకు వచ్చా. జిల్లాకు వచ్చినపుడు ఉత్తమ కార్యకర్తలు, కార్యకర్తలను కలుస్తానని ఇచ్చిన హామీమేరకు మీ ముందు నిలబడుతున్నా. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును నిర్దేశిస్తూ ఆరుశాసనాలు ప్రకటించాం. తెలుగుజాతి విశ్వఖ్యాతి, అన్నదాత కు అండగా, యువగళం, స్త్రీశక్తి, సోషల్ రీఇంజనీరింగ్ – పేదల సేవలో, కార్యకర్తే అధినేత. ఒకటికి 10సార్లు మాట్లాడి ఈ శాసనాలు పెట్టాం. సామాన్య కార్యకర్త నుంచి పొలిట్ బ్యూరో వరకు ఇదే లైన్ నరనరాన ఎక్కించాలి. కార్యకర్తల ఆకాంక్షలమేరకు నేతలు పనిచేయాలి ఈరోజు మనం అధికారం పీఠంపై కూర్చోవడానికి కార్యకర్తలే కారణం. కార్యకర్తల ఆకాంక్షల నాయకులు పనిచేయాలి. నమ్ముకున్న సిద్ధాంతం కోసం కేడర్ కష్టపడాలి. సమస్యలుంటే మాట్లాడాలి, పోరాడాలి, సాధించాలి. తల్లికివందనం పథకం కింద త్వరలో ఒకేసారి తల్లుల ఖాతాలో డబ్బు వేస్తున్నాం. సంక్షేమంలో వెనకడుగు వేసేది లేదు. ఆగస్టు 15నుంచి మహిళలకు ఉచిత బస్సుసౌకర్యం కల్పిస్తున్నాం. గత అయిదేళ్ల విధ్వంసక పాలన వల్ల అన్నీ ఒకేసారి చేయాలంటే డబ్బు మనవద్ద లేదు. దశలవారీగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. గ్రామం, జోనల్, మండలం, జిల్లాస్థాయిల్లో ఎక్కడిక్కడే సమస్యలు పరిష్కరించాలి. సాధ్యం కాకపోతే మా దృష్టికి తేవాలి. పార్టీపై అలిగి ఇళ్లలో కూర్చుంటే రాష్ట్రానికి అన్యాయం చేసిన వారవుతారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో లాగే ఉండాలి వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా బెంగుళూరులో ప్యాలెస్ లో పడుకుంటారు. కార్యకర్తలను కలవరు. ఆయన ఇంటిముందు గేటు 30 అడుగులు కట్టారు. ఓడిపోయాక కార్యకర్తలు లోపలకు వెళ్లకుండా జైలుమాదిరి గేటు కట్టుకున్నాడు. కార్యకర్తలను కలవరు, వారు చెప్పింది వినరు. అధికారంలో ఉన్నా మనం ప్రతిపక్షంలో మాదిరి వ్యవహరించాలి. 10 నిర్ణయాల్లో 3 తప్పు అవుతాయి, సరిచేసుకుంటాం. ఇది మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, సంక్షేమం అభివృద్ధిని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళతాం. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటాం. మీ భవిష్యత్తుకు నాది బాధ్యత. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు, నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల వివరాలిస్తే పార్టీ కార్యాలయం ద్వారా పరిష్కరిస్తాం" అని మంత్రి లోకేశ్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దామచర్ల సత్య, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :