Tuesday, 31 March 2026 04:31:44 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Lakshmi Parvathi: వైసీపీ అధికారంలోకి రాగానే నారా లోకేశ్ ను అరెస్ట్ చేస్తాం: లక్ష్మీపార్వతి

Date : 19 January 2026 07:20 PM Views : 106

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ఎన్టీఆర్ పై చంద్రబాబుకు గౌరవం లేదన్న లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించడంలో వెనకడుగు వేస్తున్నారని మండిపాటు తమ ప్రభుత్వం రాగానే లోకేశ్ పై ఎంక్వైరీ కమిషన్ వేస్తామని వ్యాఖ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోసాలు, వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబుకు కొత్తకాదని, ఇవన్నీ ఆయనకు అలవాటేనని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరుతో రాజకీయాలు చేయడం తప్ప, నిజంగా ఆయనపై ప్రేమ, గౌరవం చంద్రబాబుకు లేవని ఆరోపించారు. ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఇస్తున్న హామీలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని లక్ష్మీపార్వతి అన్నారు. ఇతర రాష్ట్రాల నాయకులు తమ రాష్ట్రానికి చెందిన మహానీయులకు భారతరత్న ఇప్పించేందుకు కేంద్రంపై పోరాటం చేస్తుంటే... ఎన్టీఆర్ లాంటి మహానాయకుడి విషయంలో చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. నిజంగా ఎన్టీఆర్‌పై గౌరవం ఉంటే, కేంద్రంపై ఒత్తిడి చేసి భారతరత్న ఇప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హత్యలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, దీనికి కూటమి ప్రభుత్వమే కారణమని అన్నారు. మంత్రి నారా లోకేశ్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనపై ఎంక్వైరీ కమిషన్ వేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. లోకేశ్ ను జైల్లో పెడతామని అన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని చెప్పారు. దుర్మార్గులకు అండగా నిలవడం అన్యాయమని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :