Sunday, 08 February 2026 10:57:08 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

నాటు నాటు పాట ఎంత హిట్టో రఘురామ రచ్చబండ కూడా అంతే హిట్: సీఎం చంద్రబాబు

ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామ అభినందనలు తెలుపుతూ చంద్రబాబు ప్రసంగం రఘురామ పోరాట యోధుడు అంటూ కితాబు

Date : 14 November 2024 04:24 PM Views : 505

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా టీడీపీ శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. తన ప్రసంగంలో చంద్రబాబు... రఘురామను ఒక పోరాట యోధుడిగా, ధైర్యసాహసాలకు మారుపేరుగా అభివర్ణించారు. కల్మషం లేని వ్యక్తి రఘురామ అని పేర్కొన్నారు. గతంలో ఎవరెంత భయపెట్టాలని చూసినా, వెనుకంజ వేయకుండా, తాను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకెళ్లారని కొనియాడారు. ఆ సమయంలో ఏమాత్రం భయపడి ఉన్నా రఘురామ పరిస్థితి ఎలా ఉండేదో అని వ్యాఖ్యానించారు. కానీ అన్ని కష్టాలను నిబ్బరంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. ఆనాడు ఎలాంటి కుట్రలు చేయకపోయినా, ఏకపక్షంగా వ్యవహరించి రఘురామపై రాజద్రోహం కేసు పెట్టారని చంద్రబాబు వెల్లడించారు. 2021 మే 14న రఘురామను అరెస్ట్ చేశారని, ఆ రోజు ఆయన పుట్టినరోజు అని తెలిపారు. పుట్టినరోజునే అరెస్ట్ చేసిన పైశాచిక ఆనందం పొందారని, ఒక ఎంపీని అరెస్ట్ చేసి కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం దేశంలో సంచలనం సృష్టించిందని వివరించారు. హార్ట్ సర్జరీ చేసిన వ్యక్తిని ఆ విధంగా టార్చర్ చేయడం గతంలో జరగలేదని అన్నారు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను... ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదు, వినలేదు... బహుశా ఇదే మొదటిది, చివరిది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. "ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర చేశారంటూ రఘురామపై నాడు రాజద్రోహం కేసు పెట్టారు. టీవీ5, ఏబీఎన్ చానళ్లతో కలిసి కుట్ర చేశారని ఆరోపణలు మోపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రఘురామ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత హిట్టయిందో... రాజకీయాల్లో రఘురామ రచ్చబండ కార్యక్రమాలు కూడా అంతే హిట్టయ్యాయి. ఆయన డిప్యూటీ స్పీకర్ గా నిబద్ధతతో పనిచేస్తారని విశ్వసిస్తున్నాను" అంటూ చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Also Read : 'కంగువా' - మూవీ రివ్యూ!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :