Studio18 News - ANDHRA PRADESH / : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్టుకు ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్న పవన్.. వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధాకరమని అన్నారు. ఇది అందరి మనోభావాలనూ దెబ్బతీసిందన్నారు. బాధ్యులపై సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ తెలిపారు. అలాగే దేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయవ్యవస్థ, పౌరులు, మీడియా, వారి సంబంధిత డొమైన్‌లందరిచే ఈ విషయంపై చర్చ జరగాలి. సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేయకుండా ఉండేలా అందరూ కలిసిరావాలి అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
Admin
Studio18 News