Thursday, 12 March 2026 04:16:12 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Nara Lokesh: కేంద్రం మూడు భాషల విధానంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

Date : 08 September 2025 06:48 PM Views : 185

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ‘ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్ 2025’ కార్యక్రమానికి హాజరైన లోకేశ్ జాతీయ విద్యావిధానానికి (ఎన్‌ఈపీ) పూర్తి మద్దతు మూడు భాషల విధానం హిందీని రుద్దడం కాదని స్పష్టం చేసిన వైనం తాను కూడా మూడు భాషలు నేర్చుకున్న విద్యార్థినేనని వెల్లడి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానానికి (ఎన్‌ఈపీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కోయంబత్తూరులో ‘ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఎన్‌ఈపీలోని మూడు భాషల విధానాన్ని గట్టిగా సమర్థించారు. ఈ విధానం హిందీని తప్పనిసరిగా రుద్దే ప్రయత్నం కాదని, విద్యార్థులు మూడు భాషలు నేర్చుకునేందుకు ప్రోత్సహించే మంచి అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా లోకేశ్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. "నేను కూడా మూడు భాషలు నేర్చుకున్న విద్యార్థినే. ఇప్పుడు నా కొడుకు కూడా అదే చేస్తున్నాడు. ఈ రోజుల్లో పిల్లలు ఐదు భాషల వరకు నేర్చుకుంటున్నారు. వారికి నచ్చిన జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషలు నేర్చుకుంటే ఆయా దేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి" అని ఆయన వివరించారు. పిల్లలకు ఇష్టమైన భాషను నేర్చుకునే స్వేచ్ఛ ఇవ్వాలని, దానిపై రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇటీవల దిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమైన విషయాన్ని లోకేశ్ గుర్తుచేశారు. ఆ సమావేశంలో మాతృభాషకు ఇవ్వాల్సిన ప్రాధాన్యంపై చర్చ జరిగిందని తెలిపారు. "ఒక భారతీయుడిగా నాకు మాతృభాష విలువ తెలుసు, అదే సమయంలో హిందీ నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలూ తెలుసు" అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల ఆసక్తి మేరకు ఒడియా, తమిళం, కన్నడ మాధ్యమాల్లో బోధన చేపట్టేందుకు ఆదేశాలు ఇస్తున్నాం అని వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :