Saturday, 07 March 2026 08:05:32 PM
# డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు

Nara Devansh: నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు చంద్రబాబు కుటుంబం

మార్చి 21న నారా దేవాన్ష్ పుట్టినరోజు మార్చి 20న తిరుమలకు చంద్రబాబు కుటుంబం అన్నప్రసాదం ఒక్కరోజు ఖర్చు రూ.44 లక్షలు విరాళంగా ఇవ్వనున్న వైనం

Date : 18 March 2025 03:19 PM Views : 508

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ మార్చి 21వ తేదీన పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు కుటుంబం ఎప్పట్లాగానే తిరుమలలో దేవాన్ష్ జన్మదినం జరుపనుంది. దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అప్ డేట్ ఇచ్చారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు కుటుంబం ఈ నెల 20న తిరుమల రానుందని వెల్లడించారు. ఈ నెల 21న దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్ ఇతర కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనానంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించనున్నారు. మార్చి 21వ తేదీన ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను చంద్రబాబు కుటుంబం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :