Monday, 02 December 2024 01:16:57 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Kollu Ravindra: పేర్ని నానీ... గుడివాడలో కొట్టినా బుద్ధి రాలేదా? పళ్లు రాలిపోతాయ్: కొల్లు రవీంద్ర

Date : 26 September 2024 04:03 PM Views : 23

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూ వివాదంపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... రవాణా శాఖ మంత్రిగా పని చేసినప్పటికీ... బందరు బస్టాండ్ ను అభివృద్ధి చేయలేదని... ఇప్పుడు లడ్డూ అంశంలో పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే పళ్లు రాలిపోతాయని హెచ్చరించారు. మీ అధినేత జగన్ కు కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిపై విశ్వాసం లేదు... అలాంటి వ్యక్తిని వెనకేసుకురావడానికి నీకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉంటే స్వామివారికి ఐదేళ్లలో ఒక్కసారైనా సతీసమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించారా? అని నిలదీశారు. మొన్న గుడివాడలో నిన్ను జనాలు కొట్టినా సిగ్గు రాలేదా? అని ఎద్దేవా చేశారు. ఈసారి బందరు ప్రజలు నిన్ను తరిమి కొడతారని చెప్పారు. ఇంకోసారి నోటికొచ్చినట్టు వాగితే... నోరు మూసుకునేలా బుద్ధి చెపుతామని హెచ్చరించారు. పేర్ని నాని ఏమన్నారంటే.. "తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేస్తున్నారు. స్వామి ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. చంద్రబాబు, లోకేశ్ లవి దుర్మార్గపు మాటలు. ఆ మాటలను పవన్ కల్యాణ్ భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్నాడు. కూటమి నేతలు తిరుమల పవిత్రతను అపవిత్రం చేశారు. కూటమి నేతల పాపాలను క్షమించి వదిలేయాలని ఈ నెల 28న పూజలు చేస్తాం" అని పేర్ని నాని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు