Thursday, 05 December 2024 09:48:31 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ఏమన్నారంటే..?

మహిళా శిశు సంక్షేమానికి 4 వేల కోట్ల నిధుల కేటాయించిన ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తామన్న మంత్రి పేదరికంతో రాష్ట్రంలో ఒక్క విద్యార్థ

Date : 11 November 2024 01:38 PM Views : 74

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి సమాజ పురోగతిని కొలుస్తానన్న అంబేద్కర్ మాటలను అనుసరించి ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా సాధికారతపై దృష్టి సారించారని మంత్రి పయ్యావల కేశవ్ పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి, వివిధ శాఖల కేటాయింపులపై ప్రసంగించారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు ఈ ఏడాది బడ్జెట్ లో రూ.4,285 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తామని మంత్రి చెప్పారు. పేదరికం కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. అదేవిధంగా, దీపం–2 పథకం ద్వారా గృహిణులకు ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని గుర్తుచేశారు. ఈ పథకం కింద ఇప్పటికే 5 లక్షల మంది గృహిణులు లబ్ది పొందుతున్నారని అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Also Read : తెలుగు జాతిపై నోరు పారేసుకున్న సినీనటి కస్తూరి కోసం పోలీసుల గాలింపు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు