Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలోని పత్తి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్లలో జాప్యం, తగ్గిన ధరలు పత్తి రైతులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయని చెప్పారు. మన దేశంలోని 31 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాల్లో కేవలం 20 మాత్రమే పని చేస్తున్నాయని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర టెక్స్ టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ జోక్యం చేసుకోవాలని... కొంత తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేలా కాటన్ కార్పొరేషన్ కు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు.
Also Read : అరెస్టు భయంతో ఆర్‌జీవీ అదృశ్యం.. ఆయన ఇంటి వద్ద వేచి చూస్తున్న పోలీసులు!
Admin
Studio18 News