Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం గాంధీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. బాపూజీ స్ఫూర్తితోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకురావడం జరిగిందన్నారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే.. మనం ఆరోగ్యంగా ఉంటామని చంద్రబాబు తెలిపారు.
Admin
Studio18 News