Thursday, 12 March 2026 01:11:31 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Jagan Mohan Reddy: జగన్ గుంటూరు పర్యటన... పలువురు నేతలపై కేసులు నమోదు

Date : 06 February 2026 07:18 PM Views : 24

Studio18 News - ANDHRA PRADESH / Guntur : గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్ జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీలు నిర్వహించిన పలువురు వైసీపీ నేతలు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారంటూ కేసులు నమోదు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత చేపట్టిన గుంటూరు పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు హల్ చల్ చేశారు. పోలీసు యాక్ట్ 30ను పట్టించుకోకుండా అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... నల్లపాడులో పోతిన మహేశ్, బలసాని కిరణ్ కుమార్ పై కేసు నమోదయింది. మంగళగిరిలో నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, తాడేపల్లిలో దొంతిరెడ్డి వేమారెడ్డిపై, నగరంపాలెం ప్రాంతంలో పానుగంటి చైతన్య, నూరి ఫాతిమా, గుంటూరు పట్టాభిపురంలో అంబటి మురళిపై కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ... వైసీపీ నేతలు చేపట్టిన ర్యాలీల కారణంగా గుంటూరులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. పోలీసు నిబంధనలను ఉల్లంఘించడం, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఈ క్రమంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :