Tuesday, 31 March 2026 04:29:52 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

YSRCP: ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వైసీపీ

Date : 04 February 2026 08:08 PM Views : 49

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ఏపీలో తమ నేతలపై దాడులంటూ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు, దళిత కార్యకర్త హత్యపై విచారణకు విజ్ఞప్తి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాజ్యాంగ వ్యవస్థ బలహీనపడిందని ఆరోపణ తమ ఫిర్యాదుపై కమిషన్ సానుకూలంగా స్పందించిందని తెలిపిన వైసీపీ నేతలు ఏపీకి నిజనిర్ధారణ కమిటీని పంపే అవకాశం ఉందని వెల్లడి ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ నేతల ఇళ్లపై జరిగిన దాడులు, ఒక దళిత కార్యకర్త హత్య ఘటనలపై వైసీపీ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరపాలని కోరింది. బుధవారం నాడు ఢిల్లీలో వైసీపీ బృందం ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్ జస్టిస్ వి. రామసుబ్రమణియన్‌ను కలిసి ఫిర్యాదు అందజేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై జరిగిన దాడులతో పాటు, దళిత కార్యకర్త హత్యకు సంబంధించిన వివరాలను కమిషన్‌కు సమర్పించింది. టీడీపీ శ్రేణులు పథకం ప్రకారమే ఈ దాడులకు పాల్పడ్డాయని, ప్రతిపక్ష నేతలను భౌతికంగా అంతమొందించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఆధారాలుగా అందజేశారు. సమావేశం అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, మాజీ మంత్రులపై పెట్రోల్ బాంబులతో దాడికి యత్నించారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ బలహీనపడిందని ఆదిమూలపు సురేష్ విమర్శించారు. కొందరు నేతలు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్ సానుకూలంగా స్పందించారని వైసీపీ నేతలు తెలిపారు. ఏపీ డీజీపీ నుంచి నివేదిక కోరడంతో పాటు, వాస్తవాలను తెలుసుకునేందుకు ఒక నిజనిర్ధారణ బృందాన్ని రాష్ట్రానికి పంపే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ఈ బృందంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, మాజీ మంత్రులు తదితరులు ఉన్నారు. హత్యకు గురైన దళిత కార్యకర్త సల్మాన్ సోదరుడు కూడా తమ గ్రామంలో శాంతిని కాపాడాలని కమిషన్‌ను కోరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :