Friday, 13 December 2024 09:29:17 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

తిరుమల లడ్డూ వివాదంపై ప్రెస్‌మీట్‌లో వైఎస్ జగన్ సంచలన కామెంట్స్

Date : 20 September 2024 03:46 PM Views : 27

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తిరుమలలో లడ్డూ నెయ్యి కల్తీ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకునే వైఖరి చంద్రబాబు నాయుడిదని అన్నారు. చంద్రబాబు చేసేవి అన్నీ డైవర్షన్ పాలిటిక్సేనని తెలిపారు. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని అసత్యాలు చెప్పారని జగన్ అన్నారు. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబుకి ఇది తగునా? అని అన్నారు. పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు నాయుడు ఇలా కట్టుకథలు చెబుతున్నారని తెలిపారు. కూటమి సర్కారు 100 రోజుల పాలనపై వైఎస్ జగన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. 100 రోజుల్లో సూపర్‌ సిక్సూ లేదు.. సెవనూ లేదని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. మహిళలకు రూ.18 వేల చొప్పున ఇస్తామన్నారని, పిల్లలకు రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారని, కానీ ఇవ్వలేదని తెలిపారు. చంద్రబాబు చేసింది మోసమని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగానూ విఫలమైందని చెప్పారు. చంద్రబాబు నాయుడి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వ్యవస్థలూ తిరోగమనం చెందుతున్నాయని తెలిపారు. మభ్యపెట్టే రాజకీయం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారని చెప్పారు. ఏపీలో జరుగుతున్న అరాచక పాలనపై తాము ఢిల్లీలో ధర్నా చేశామని అన్నారు. అదే సమయంలో డైవర్షన్ కోసం మదనపల్లెలో ఫైల్స్ కాలిపోయానని అన్నారని తెలిపారు. జగన్‌ కామెంట్స్‌ ప్రతి ఇంటికి వెళ్లి మరి మోసం చేసాడు 100 రోజుల్లో చేసింది మోసం.. మోసం.. మోసం.. ఇప్పటి వరకు ఒక్క బిల్ పాస్ కాలేదు రైతు పూర్తిగా రోడ్డున్న పడాడ్డు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది రాష్ట్రంలో ధర్మానికి రక్షణ లేకుండా పోయింది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అతి దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు దేవునికుడా వదల్లేదు ఒక ముఖ్యమంత్రి గా మాట్లాడాల్సిన మాటల అవి?

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు