Saturday, 24 January 2026 03:11:02 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Pawan Kalyan: పుస్తకాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి: పవన్ కల్యాణ్

Date : 11 October 2025 07:05 PM Views : 222

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : లక్ష్మీ పురి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ పుస్తకాలు చదవడం వల్లే మానసిక పరిపక్వత వస్తుందన్న పవన్ పవన్ కల్యాణ్ తన అభిమాన నాయకుడని చెప్పిన మంత్రి సత్యకుమార్ పుస్తకాలు చదవడం ద్వారానే మానసిక పరిపక్వత సాధ్యమవుతుందని, తన జీవితంపై పుస్తకాల ప్రభావం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించడం చాలా ముఖ్యమని, తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన 'ఆమె సూర్యుడిని కబళించింది' అనే పుస్తకాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఏదైనా సాధించాలంటే పట్టుదల చాలా అవసరం. ఈ పుస్తకంలోని మాలతి పాత్ర నాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చింది. ఆ పాత్రలో ధైర్యసాహసాలు, మేధస్సు, స్వాతంత్ర్య కాలం నాటి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు కనిపిస్తాయి" అని వివరించారు. తన తల్లి వంట గది నుంచే ప్రపంచాన్ని చూశారని గుర్తుచేసుకున్నారు. భారతీయ ఆలోచనా విధానం నుంచే తాను వచ్చానని, మన దేశంలో స్త్రీకి అత్యున్నత గౌరవం ఉందని పవన్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ మహిళా విభాగానికి 'ఝాన్సీ వీర మహిళ' అని పేరు పెట్టినట్లు గుర్తుచేశారు. ఇదే వేదికపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను త్వరలోనే అమలు చేయబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, "పవన్ కల్యాణ్ నా అభిమాన నాయకుడు. నేను ఈ రోజు మంత్రిగా కాకుండా సాధారణ వ్యక్తిగా వచ్చి ఉంటే, మీ అందరితో కలిసి కింద కూర్చుని 'పవర్ స్టార్', 'ఓజీ' అని గట్టిగా అరిచేవాడిని" అని తన అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి వ్యాఖ్యలతో సభలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :