Thursday, 12 March 2026 01:02:15 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Kolusu Parthasarathi: బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ తెలిసి కూడా జగన్ అలా మాట్లాడడం పద్ధతి కాదు: మంత్రి పార్థసారథి

Date : 24 October 2025 06:29 PM Views : 146

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి అసెంబ్లీకి రాకుండా మాట్లాడటం సరికాదని హితవు జగన్ హయాంలో అదానీ డేటా సెంటర్ ఎందుకు రాలేదని ప్రశ్న నివాసయోగ్యం కాని సెంటు భూమి లేఅవుట్లు రద్దు చేస్తామని ప్రకటన వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా, సహచర శాసనసభ్యుడి గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం జగన్‌కు తగదని హితవు పలికారు. శుక్రవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ గురించి, ఆయన ప్రవర్తన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, అలాంటి వ్యక్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఎలా చేస్తారని జగన్‌ను ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. అనంతరం విశాఖ డేటా సెంటర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, జగన్ హయాంలో అదానీ డేటా సెంటర్ ఎందుకు ఏర్పాటు కాలేదని నిలదీశారు. ఆ సంస్థ ఏపీ నుంచి ఎందుకు వెనక్కి వెళ్లిపోయిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను పార్థసారథి వెల్లడించారు. గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన సెంటు భూమి స్థలాలు చాలాచోట్ల నివాసయోగ్యంగా లేవని విమర్శించారు. ఈ నేపథ్యంలో, ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాని లేఅవుట్లను రద్దు చేసి, లబ్ధిదారులకు 2 నుంచి 3 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే నిర్మాణాలు మొదలుపెట్టి పూర్తికాని వారికి కూడా ఇదే తరహాలో కేటాయింపులు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశంపై కూడా చర్చించామని, ఈ విషయంలో ఉన్న సమస్యలను అధిగమించి త్వరలోనే ముందుకు వెళతామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :