Saturday, 07 March 2026 09:14:51 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

గంజాయి బ్యాచ్ ఇంటికి జగన్ వెళుతున్నారు: అనిత

Date : 02 June 2025 12:13 PM Views : 232

Studio18 News - ANDHRA PRADESH / : రాజకీయ ప్రయోజనాల కోసం తెనాలి ఘటనకు కులం, మతం రంగు పులుముతున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. విజయవాడ సత్యనారాయణపురం మోడల్ పోలీస్ స్టేషన్‌ను డీజీపీతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.. తెనాలి ఘటనకు సంబంధించిన యువకులపై పలు కేసులు ఉన్నాయని, పోలీసులపైనే వారు చేయి చేసుకున్నారని డీజీపీ వెల్లడించారని అనిత గుర్తుచేశారు. అలాంటి గంజాయి బ్యాచ్ ఇంటికి వైసీపీ అధినేత జగన్ వెళుతున్నారని... ఇది కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి, కులమతాలను రెచ్చగొట్టడానికేనని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే, తమ కార్యకర్తలకు బీపీ వచ్చిందని జగన్ సమర్థించుకున్నారని గుర్తుచేశారు. వైసీపీ హయాంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డుపై కొట్టినా, రాజమండ్రిలో ఇసుక మాఫియాపై మాట్లాడిన వరప్రసాద్‌కు పోలీస్ స్టేషన్‌లో శిరోముండనం చేసినా ఆనాడు జగన్ ఎందుకు స్పందించలేదని, వారి ఇళ్లకు వెళ్లి ఎందుకు పరామర్శించలేదని అనిత నిలదీశారు. పులివెందులలో మహిళ హత్యకు గురైనప్పుడు తాము వెళితే కేసు పెట్టారని అన్నారు. తమ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు లేవని, పోలీసులను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని ఆమె స్పష్టం చేశారు. పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించవద్దని సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :